Pages

కవితలు

1. ఆకు రాల్తు చెప్పింది జీవితం శాశ్వతం కాదు అని ,
    పువ్వు  వికసిస్తూ చెప్పింది ఎప్పుడు నవ్వుతు ఉండమని..

2. ప్రేమించే హృదయం లేనప్పుడు , ఆకర్షించే అందం ఎందుకు ?

3. సింహం తో వేట నరేంద్ర తో ఆట వద్దు..

4. ఆట నువ్వు మొదలు పెట్టావ్ ,ముగింపు  నేను ఇస్తాను ...

5. నేను ACTION  లో  ఉన్నప్పుడు , నీ REACTION  ఉండకూడదు ...

6. ప్రియా,
    ముత్యాలతో నీ మేనికి నగలు చేయిస్తా,తారలతో నీకు మేడలు కడతా,
    నీతో ఊహలలో విహరిస్తా,సృష్టి లోని సౌందర్యాన్ని నీకు పరిచయం చేస్తా,
    నీ ఇష్టాన్ని స్వాగతిస్తా,నీకై తపించే నా హృదయాన్ని నీకు బహుమతి గా ఇస్తా,
    సూర్య చంద్రులు కనుమరుగైనా ,సునామీలు ఎన్నొచ్చినా నీకు నేతోడుంటా.


7.  సంతోషం నాతో చెలిమి చేస్తానని,
   ఆనందం నా చిరునామాని మర్చిపోనని,
   షికారు నే లేకపొతే హుషారుగా ఉండనని ,
   ఉత్సాహం నా వెంటే పరుగు తీస్తానని,
   విషాదం నా దరిదాపులకి చేరనని,
   నమ్మకం నా మాటలతో కలిసి నడుస్తానని,
   హామీలిచ్చాయి..అదే నిజమైతే ప్రతిది నా సొంతమే.

8.  నా చెలికి,
    నిండు జాబిలితో మాటలంటే ఇష్టం,
    కోనేటి గట్టున జలకాలాట ఇష్టం,
    ప్రకృతి ఒడిలో పరవశించడం ఇష్టం,
    జోరు వానలో చిందులంటే ఇష్టం,
   చీరకట్టుతో మైమరపించటం ఇష్టం,
   నవ్వుతూ నవ్విస్తూ ఉండటం ఇష్టం.

9. అమ్మ చేతి గోరు ముద్దలు,
    నాన్నతో చెప్పే రాత్రి కబుర్లు,
    స్నేహితుల అనురాగాలు,
    బంధువుల ఆప్యాయతలు,
    ప్రియురాలితో సరసాలు,
    బుజ్జాయితో ఆడే ఆటపాటలు,
    సృష్టిలోనే అతి మధురమైనవి.

10. చల్లని గాలులు హృదయానికి హత్తుకుపోతే,
   కారు మబ్బులు కరిగి జడి వాన మొదలైతే,
   ఆకాశాన హరివిల్లు కనులవిందు చేస్తుంటే, 
   పురి విప్పిన నెమలి నాట్యపు హొయలొలికిస్తే,
   కమ్మని సంగీతం గిలిగింతలు పెడుతుంటే,
   వెచ్చని తోడు కోసం మది ఆరాటపడుతుంటే,
   ఆ హాయి కి ఇలలో సాటి లేనే లేదోయి.
11. ఓ ప్రియతమా,
   మనసు మురిసినా, మది కలలతో మెరిసినా,
   మాటలు తడబడినా, అడుగులు జరగనంటున్నా,
   చూపులు మత్తెకించినా, సిగ్గులు షికార్లు చేస్తున్నా,
   శ్వాస ఆశతో నిండినా, ఊహలు ఉరకలేస్తున్నా,
   అది నీ వల్లే..నీ వల్లే

No response to “కవితలు”

Post a Comment