Pages

ఇది విన్నారా?

 

  • ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు కానీ వానలో దాని బండారం తప్పక బయటపడుతుంది.
  • ఇతరులకంటే మెరుగ్గా ఉండాలనుకొవడం కాదు, ఎప్పుడూ నీ కంటే నువ్వు మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించు.
  • పగ సాధించడానికన్నా క్షమించడానికే ఎక్కువ మనోబలం కావాలి.
  • సమస్త విజయాలకు సహనమే సాధనం. గుడ్డుని పొదిగితేనే పిల్లను పొందగలం కానీ పగులకొట్టి కాదు.
  • మరీ తియ్యగా(మంచిగా) ఉంటే నిన్ను మింగేస్తారు. మరీ చేదుగా(చెడ్డగా) ఉంటే ఉమ్మేస్తారు.
  • రహస్యం..నీ దగ్గరున్నంతవరకు నీకు బానిస. మరొకరికి చెప్పావంటే ఇక అది నీ యజమాని. 
  • ఆచరణ లేని ఆలోచన, ఆలోచన లేని ఆచరణ రెండూ ఓటమికి రహదారులే.
  • వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు. కొత్త ప్రేరణకు పునాది కావాలి.
  • ఇతరుల ప్రాపకంతో పైకొచ్చి ఉన్నతపదవులు పొందినవారి వల్ల అందరికి ఇక్కట్లే. స్వశక్తితో పైకొచ్చినవారికి అల్ప బుద్ధి ఉండదు. సూర్యుని వేడిని భరించగలం కానీ ఎండకు వేడెక్కిన బండరాళ్ళ మీద నడవలేం కదా! 
  • మేధాశక్తి క్షీణించడం మొదలైంది అనడానికి విసుగు తొలి సంకేతం.
  • నీ ప్రతిభ గుర్తింపు పొందాలనుకుంటే ఇతరుల ప్రతిభను గుర్తించడం నువ్వు నేర్చుకోవాలి.
  • అన్నివేళలా సింహంలా గంభీరంగా ఉంటే సరిపోదు. అప్పుడప్పుడూ నక్క జిత్తులు అవసరమవుతాయి. 
  • దురలవాట్లు మొదట్లో సాలెగూళ్ళు. ఆపై ఇనుపగొలుసులు.  
  • తెలియనిది అడిగితే బయటపడే అఙానం కొద్దిసేపే. అడగకపోతే జీవితాంతం అఙానమే. 

No response to “ఇది విన్నారా?”

Post a Comment