Pages

ముకేష్ అంబానీ ఇంటి కరెంటు బిల్లు రూ. 80 లక్షలు

అపర కుబేరుడు ముకేష్ అంబానీ మరో రికార్డు సృష్టించారు. ఈసారి విద్యుత్ బిల్లు చెల్లింపుల్లో...

 ముంబైలోని ముకేశ్ అంబానీ ఆకాశ సౌధం యాంటిల్లాకు ఒక నెలలో అయిన కరెంట్ బిల్లు ఎంతో తెలుసా?

 ఓ లగ్జరీ ఫ్లాట్ ఖరీదంత-అక్షరాలా 70 లక్షల 69 వేల 488 రూపాయలు. ముంబైలోనే అత్యధిక గృహ విద్యుత్ బిల్లు ఇది. సెప్టెంబర్ నెలలో యాంటిల్లా నిర్వహణకు అయిన విద్యుత్ వాడకం 6,37,240 యూనిట్లు. ముకేష్ అంబానీ తన భార్య నీతా, ముగ్గురు సంతానంతో కలిసి సెప్టెంబర్‌లో యాంటిల్లాలో గృహప్రవేశం చేశారు. ముకేష్ అంబానీ ఈ కరెంట్ బిల్లును ఎటువంటి జాప్యం లేకుండా చెల్లించినందుకు 48,354 రూపాయల డిస్కౌంట్ పొందారు.

 ఈ మొత్తం కూడా కలిపితే ఆ విద్యుత్ బిల్లు మొత్తం 80 లక్షల రూపాయలు దాటిపోతుంది. అన్ని ఎలక్ట్రికల్ ఉపకరణాలున్న ఒక ఇంటికి నెలవారి విద్యుత్ వాడకం 300 యూనిట్లదాకా అవుతుంది. దీన్ని బట్టి చూస్తే ముకేష్ అంబానీ చెల్లించిన విద్యుత్ బిల్లు మొత్తంతో 7000 ఇళ్లకు ఓ నెల విద్యుత్ బిల్లులు కట్టవచ్చు.

 అపర కుబేరుడి ఇల్లు కదా ఆ మాత్రం కరెంట్ బిల్లవుతుందని అనేవారు కూడా ఉన్నారు. అదండీ సంగతి.

No response to “ముకేష్ అంబానీ ఇంటి కరెంటు బిల్లు రూ. 80 లక్షలు”

Post a Comment